తెలంగాణ

telangana

ETV Bharat / city

badvelu by election: 'రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల'

రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల(badvelu by election notification) చేయనున్నట్లు కడప కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బురాజన్​తో కలిసి కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు.

badvelu by election: 'రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల'
badvelu by election: 'రేపు బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల'

By

Published : Sep 30, 2021, 6:36 PM IST

ఈవీఎంల ద్వారా బద్వేలు ఉపఎన్నిక(badvelu by election) పోలింగ్ జరగనుందని కడప కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. రేపు(శుక్రవారం) బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరుగనుందని(collector vijayaramaraju on badvelu by election) కలెక్టర్ తెలిపారు. రేపటి నుంచి బద్వేలు ఉపఎన్నిక(badvelu by election notification)కు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా సబ్​కలెక్టర్ కెథన్ కార్గ్​ను నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్​తో కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు బద్వేలు పరిధిలో అధికారుల బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు.

అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో వెయ్యి మందితోనే బహిరంగ సభ నిర్వహించుకోవాలి. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం ఐదుగురితో ప్రచారం నిర్వహించాలి. పోలింగ్ సిబ్బంది, అధికారులు, ఏజెంట్లకు వ్యాక్సినేషన్​ తప్పనిసరి. ప్రచారం సందర్భంగా ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తున్నాం.-విజయరామరాజు, కడప కలెక్టర్‌

ఇదీ చదవండి:Bjp Meeting: అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో భాజపా భారీ బహిరంగ సభ

ABOUT THE AUTHOR

...view details