తెలంగాణ

telangana

ETV Bharat / city

కేఏ పాల్​ పీఎం... పవన్ కల్యాణ్​ సీఎం..! - పవన్ కల్యాణ్​ సీఎం

సోషల్‌మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా షేర్​ చేసిన పోస్ట్​ వైరల్​గా మారింది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు. దానికి పవన్ కల్యాణ్​ను కూడా ట్యాగ్ చేశాడు.

Praja Santhi Party President Ka Paul
Praja Santhi Party President Ka Paul

By

Published : Mar 4, 2022, 3:29 PM IST

రాంగోపాల్ వర్మ తాజాగా షేర్​ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్​గా మారింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి నేనేనంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్​లో ఉంచగా యమ స్పీడ్​గా వైరల్​ అయింది. ఈ వీడియోకి పవన్ కల్యాణ్​ను కూడా ట్యాగ్ చేశాడు వర్మ.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

" పవన్ కల్యాణ్​ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి. 42 ఎంపీలను గెలిపించుకుని నేను ప్రధానమంత్రి అవుతా. పవన్​ ప్రజాశాంతి పార్టీలో చేరితే ఆయణ్ను ఏపీ సీఎం చేద్దాం." అంటూ కేఏ పాల్ మాట్లాడిన వీడియోను వర్మ తన ట్విట్టర్​లో షేర్ చేశాడు.

ఇదీ చూడండి:రాంచీలో కేసీఆర్ పర్యటన.. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రితో భేటీ..

ABOUT THE AUTHOR

...view details