తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు.. భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ.. - కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు

KA Paul Complaint on KCR: సీఎం కేసీఆర్​పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్​తో పాటు కేటీఆర్​, హరీశ్​రావు, సంతోష్​, కవితపై కూడా ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం, యాదాద్రి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పాల్​ తెలిపారు.

KA Paul Complaint to CBI on CM KCR and his family about Kaleshwaram Corruption
KA Paul Complaint to CBI on CM KCR and his family about Kaleshwaram Corruption

By

Published : Jun 22, 2022, 7:09 PM IST

KA Paul Complaint on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావులపై... సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. యాదాద్రి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కేఏ పాల్‌ తెలిపారు.

"సీబీఐ అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్​తో పాటు కేటీఆర్​, హరీశ్​రావు, కవిత, సంతోష్​పై ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో చాలా పెద్ద ప్రాజెక్టయిన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కంప్లైంట్​ చేశాం. లక్షా ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగినట్టు వివరించాం. యాదాద్రి ప్రాజెక్టులోనూ అవకతవకలు జరిగినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో వీళ్ల అవినీతి గురించి.. సుదీర్ఘంగా అధికారులకు వివరించాం. వాళ్లు కూడా ఓపికతో ఆలకించారు. ఏవిధంగా విచారణ చేస్తారో అధికారులు వివరించారు. ఇందులో భాగంగా వాళ్లకు ఎలాంటి సహకారం కావాలన్న నావంతు సహకరిస్తానని తెలిపాను. ఈ విచారణ చాలా ప్రమాదకరమైనది కాబట్టి.. అధికారులకు ఎలాంటి కీడు జరగకూడదని ప్రార్థన కూడా చేశాం." - కేఏ పాల్​, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు.. భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ..

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details