ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడో ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు (new cj of ap high court justice prashant kumar mishranews). విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(ap governor).. ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan news) .. నూతన సీజేకు పుష్పగుచ్ఛం అందించారు.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్(Justice Prashant Kumar Mishra news) మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు(ap high court cj news). 2009 డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా..అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.