భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు జాతి ముద్దుబిడ్డ జస్టిస్ ఎన్వీ రమణకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ చిత్రకారుడు కళా నీరాజనం పలికారు. దేశ పటంపై జస్టిస్ ఎన్వీ రమణ చిత్రాన్ని బాల్ పెన్నుతో గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
దేశపటంపై జస్టిస్ ఎన్వీ రమణ చిత్రం.. అభిమానం చాటుకున్న చిత్రకారుడు - kadiri latest news
దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణను దేశపటంపై చిత్రీకరించి అభిమానం చాటుకున్నాడో కళాకారుడు. తెలుగు జాతికి ఆయన గర్వకారణమని పేర్కొన్నాడు.
దేశపటంపై జస్టిస్ ఎన్వీ రమణ చిత్రం
తెలుగు జాతికే జస్టిస్ ఎన్వీ రమణ గర్వకారణంగా నిలిచారన్న చిత్రకారుడు శేషాద్రి.. ఎన్నో రోజులు శ్రమించి ఆయన బొమ్మ గీశానని చెప్పారు.
ఇదీ చదవండి:కరోనా టెస్ట్‌లో నెగిటివ్ వచ్చింది.. కానీ ప్రాణం పోయింది..