Justice NV Ramana: న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని.... తెలంగాణలో కేసీఆర్ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్‌గా కేసీఆర్ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు.
చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్‌గా కేసీఆర్: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - Justice NV Ramana appreciation
Justice NV Ramana: హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు.
"హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచాం. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరం. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించాం. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నాం. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్ మాత్రం 4,320కి పైగా ఉద్యోగాలను సృష్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చింది. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోంది. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు." - జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇవీ చూడండి: