తెలంగాణ

telangana

ETV Bharat / city

'సుప్రీం'కు విద్యుత్​ ఉద్యోగుల విభజన నివేదిక - తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విచారణ నేటితో ముగిసింది. 1,157 మంది ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడంపై గత కొంత కాలంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. శని, ఆదివారాలు విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు.

electricity employees division
'సుప్రీం'కు విద్యుత్​ ఉద్యోగుల విభజన నివేదిక

By

Published : Dec 15, 2019, 10:13 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విచారణ ముగిసింది. 1,157 మంది ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. ఏపీ స్థానికత కలిగిన 1,157 మందిలో 613 మంది తాము ఏపీలోనే పనిచేస్తామని ఆప్షన్‌ ఇచ్చారు. వారిని చేర్చుకోవడానికి ఇబ్బంది ఏముందని ఏపీ అధికారులను జస్టిస్‌ ధర్మాధికారి గతంలోనే ప్రశ్నించారు. 613 మందిని ఏపీలో చేర్చుకుంటే మిగిలిన 545 మంది పంపకాలపై సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ధర్మాధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
రాష్ట్రం విడిపోయినప్పటికీ విద్యుత్‌ ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కోసం నియమించిన జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ సుమారు ఐదేళ్లుగా పలు దఫాలుగా విచారిస్తూ వస్తోంది. చివరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది.

'సుప్రీం'కు విద్యుత్​ ఉద్యోగుల విభజన నివేదిక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details