ప్రొబెషన్ పీరియడ్‌ను తగ్గించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కోరింది. మంత్రిని కలిసిన సంఘం ప్రతినిధులు.. వేతనాలు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రొబెషన్ పీరియడ్ తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల విజ్ఞప్తి - Junior Panchayat Secretaries met minister errabelli
ప్రొబెషన్ పీరియడ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కోరింది. ఎప్పటికప్పుడు తమ సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ఈ సంఘం సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి.. ఎప్పటికప్పుడు తమకు మార్గదర్శకాలు జారీ చేస్తూ.. పల్లెప్రగతి విజయానికి కృషి చేయడమే గాక, తమ సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. ప్రొబెషనరీ పీరియడ్ తగ్గించి.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో ఆపరేటర్లుగా పనిచేస్తున్న 11 వందల మందికి ఉద్యోగ భద్రత కల్పించి.. ఖజానా నుంచి వేతనాలు అందేలా చూడాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, పీఆర్సీని తమకు కూడా వర్తింపజేయాలని ఈ-పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రికి విన్నవించారు.
- ఇదీ చదవండి :ఒకే ఊరిలో 170 మందికి కరోనా పాజిటివ్