రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా విధులను జూడాలు బహిష్కరించారు. పెంచిన స్టైపండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు.
JUDA strike: 'రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తాం' - junior doctors protest news
10:25 May 26
juda strike: అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించిన జూడాలు
కొవిడ్ బారిన పడిన వైద్యసిబ్బందికి నిమ్స్‌లో చికిత్స అందించాలని కోరారు. కొవిడ్‌తో మృతి చెందిన వైద్యులకు రూ.50 లక్షలు, కొవిడ్‌తో చనిపోయిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేపటినుంచి రెసిడెంట్ వైద్యులు కూడా విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని... రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామని జూడాలు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కమలనాథుల వరుస మంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల మొగ్గు..!