రేపటి నుంచి ఈనెల 26 వరకు జూనియర్ వైద్యుల నిరసన - జూనియర్ వైద్యుల నిరసన
18:36 May 22
నల్ల బ్యాడ్జిలతో విధుల్లో పాల్గొంటామన్న జూనియర్ వైద్యులు
రేపటి నుంచి ఈనెల 26 వరకు జూనియర్ వైద్యులు నిరసన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 15 శాతం స్టైఫండ్ పెంపు అమలు కాకపోవడంతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ప్రకటించిన పదిశాతం ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. 26 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కొనసాగిస్తామని... ఆ తర్వాత సర్వీసులను బహిష్కరిస్తామని ప్రకటించారు.
అటు సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా నోటీసు ఇచ్చారు. గౌరవవేతనాన్ని 15 శాతం పెంచాలని, హెల్త్ కేర్ వర్కర్లకు గతంలో ప్రకటించిన పదిశాతం ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొవిడ్ బారిన పడ్డ వైద్యసిబ్బందికి నిమ్స్‌లో చికిత్స అందించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విధుల్లో చనిపోయిన వైద్యులకు రూ. 50 లక్షలు, నర్సులు, సిబ్బందికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని... లేదంటే 26 నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు.
ఇదీచూడండి:గాలి ద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం!