నేషనల్ మెడికల్ బిల్లులో అంశాలను సవరించాలని గాంధీ ఆసుపత్రి ముందు ఐదుగురు జూనియర్ వైద్యులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పారామెడికల్ అభ్యర్థులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి, వైద్యం చేసేందుకు అనుమతివ్వాలనే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చలామణి అవుతున్న నకిలీ వైద్యుల నిర్మూలనకు పోరాడుతుంటే... మరో మూడు లక్షలకు పైగా వైద్యులకు అనుమతులివ్వడం దారుణమన్నారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా రెండోరోజు జూడాల దీక్ష - hunger strike
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... జూనియర్ వైద్యులు గాంధీ ఆసుపత్రి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బిల్లు సవరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు వైద్య విద్యార్థులు.
ఎన్ఎంసీ బిల్లు వ్యతిరేకంగా జూడాల ఆమరణ దీక్ష