ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. అన్నివైపులా వాదనలు పూర్తికావడంతో జులై 30న విచారణ ముగించింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది.
ఈ తీర్పు ఎలా ఉంటుందోనని అప్పటినుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దునూ కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్‌పై ఇవాళే వాదనలు ముగియడంతో.. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా సెప్టెంబర్ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.
పిటిషన్ దాఖలైనప్పటి నుంచి వాదానలు ఇలా సాగాయి..
బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను ఏపీ సీఎం జగన్ ఉల్లంఘింస్తున్నారంటూ జూన్ 4న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ ప్రధాన వాదన. సహనిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని వాదించారు.