ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ బెయిల్పై విడుదలయ్యారు. రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుపై.. బెయిల్ మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఈనెల 15న తీర్పు ఇచ్చింది. ఉత్తర్వులు అందుకున్న పీలేరు సబ్ జైలు అధికారులు.. ఈరోజు ఆయనను విడుదల చేశారు.
Judge rama krishna: బెయిల్పై విడుదలైన జడ్జి రామకృష్ణ - judge rama krishna case latest news
ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ బెయిల్పై విడుదలయ్యారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజద్రోహం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.
బెయిల్పై విడుదలైన జడ్జి రామకృష్ణ
జైలు బయట దళిత సంఘాల నాయకులు జడ్జి రామకృష్ణకు స్వాగతం పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ.. హైకోర్టు స్పష్టమైన షరతులు విధించిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు వంశీకృష్ణతో కలిసి సొంత గ్రామమైన బి.కొత్తకోటకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్టయ్యారు.
ఇదీ చదవండి:HCA:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అసలేం జరుగుతోంది..?