రంజాన్ మాసం సందర్భంగా రోజుకు 600 మందికి వారి ఇళ్లకే వెళ్లి హలీం అందించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిర్ణయించారు. హలీం తయారీని ఆదివారం తన కార్యాలయంలో ప్రారంభించారు.
రోజూ 600 మందికి హలీం.. ఇళ్ల వద్దకే పంపిణీ - mla maganti prepared haleem
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నందున ముస్లింలంతా ఇంటి పట్టునే ఉండాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సూచించారు. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లింల ఇళ్లకే వెళ్లి హలీం అందిస్తామని తెలిపారు.
హలీం తయారీ ప్రారంభించిన ఎమ్మెల్యే
కరోనా నేపథ్యంలో ముస్లింలంతా ఇంటి పట్టునే ఉండాలని ఎమ్మెల్యే కోరారు. తద్వారా కరోనాను నివారించవచ్చన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉదయం, సాయంత్రం వేళ అన్నదాన కార్యక్రమం లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు.