తెలంగాణ

telangana

ETV Bharat / city

జర్నలిస్టుల కోసం ప్రత్యేక హెల్ప్​డెస్క్​..

జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్​ హెల్ప్​డెస్క్​ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులకు కరోనా వైద్య సేవలు సత్వరం అందించే దిశగా... ప్రత్యేక వాట్సప్ ​నెంబర్‌ 8639710241 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

journalists covid help desk started today
journalists covid help desk started today

By

Published : May 1, 2021, 10:19 PM IST

పాత్రికేయుల కోసం కొవిడ్​ హెల్ప్​డెస్క్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి వైద్య ఆరోగ్య శాఖ... ప్రత్యేక వాట్సప్‌ నెంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. జర్నలిస్టులకు కరోనా వైద్య సేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయడాన్ని ప్రెస్​క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి, అనేక మంది పాత్రకేయుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా... సానుకూలంగా స్పందించారు. ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం విజ్ఞప్తి మేరకు నేటి నుంచి ప్రత్యేక వాట్సప్‌ నెంబర్‌ 8639710241 అందుబాటులోకి తీసుకొచ్చారు.

కరోనా లక్షణాలు ఉన్న పాత్రికేయులు తమ వివరాలను ఆ వాట్సప్‌ నెంబర్‌కు పంపిస్తే... వైద్య పరీక్షలు, ఔషధాల కిట్లు, అవసరమైన బాధితకులకు బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అలాగే... పాత్రికేయుల కోసం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిజేయజేశారని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ పాలకమండలి ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: 'కొవిడ్​ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'

ABOUT THE AUTHOR

...view details