తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రముఖ కవి దేవీప్రియ కన్నుమూత... సీఎం కేసీఆర్​ సంతాపం - cm kcr tribute to journalist devipriya death

ప్రముఖ కవి, సీనియర్​ పాత్రికేయులు దేవీప్రియ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నిమ్స్​లో చికిత్స పొందుతున్న దేవీప్రియ... ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు.

journalist devipriya dead in hyderabad nims
journalist devipriya dead in hyderabad nims

By

Published : Nov 21, 2020, 12:05 PM IST

ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు దేవీప్రియ పరమపదించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

కవి, రచయిత, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యానికి దేవీప్రియ కృషి చేశారని సీఎం తెలిపారు. ఆయన సాహిత్య ప్రతిభకు 'గాలి రంగు' రచన మచ్చుతునక అని కేసీఆర్​ కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్​ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: తాత అంత్యక్రియలు.. అంతలోనే మనవళ్ల మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details