తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర - jobsite enterprices cheated unmployes

ఉద్యోగాల పేరుతో  నిరుద్యుగుల్ని మోసం చేసిన కేసులు ఎన్నో చూశాం... తాజాగా మరో మోసం వెలుగు చూసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బుల వసూలు చేస్తున్న  ఖైరతాబాద్‌లోని సంస్థపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

By

Published : Oct 24, 2019, 5:34 AM IST

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ... ఖైరతాబాద్‌లోని జాబ్‌సైట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగాల కోసం పలు వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నవారి చరవాణీ నంబర్లకు సందేశాలు పంపిస్తారు. అక్కడికి వెళితే... రిజిస్ట్రేషన్‌ కోసమని వెయ్యి, శిక్షణ కోసం మరో 1500 తీసుకుంటున్నట్లు వాపోయాడు. జాబ్‌ కోసం నిలదీస్తే... ఉద్యోగానికి పనికిరావు అన్నారని ఆరోపించాడు.

సైఫాబాద్‌ పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని... బాధితుడు ఈటీవీని ఆశ్రయించాడు. వివరాలు కనుక్కునేందుకు వెళ్లిన ఈటీవీ బృందాన్ని చూసి సంస్థ ఇంఛార్జి పరారయ్యాడు. ప్రతిరోజూ ఎంతో మంది నుంచి వసూలు చేస్తూ... లక్షల రూపాయలు దోచేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. సంస్థ బోర్డు కూడా లేదని ప్రశ్నించిన ఈటీవీ బృందానికి... తమ సంస్థ దిల్లీ నుంచి నడుస్తుందని, ఇక్కడ కంపనీ సిబ్బంది మాత్రమే ఉంటారని పొంతనలేని సమాధానం చెప్పారు. ఫిర్యాదు చేసినా పోలీసులు దీనిపై స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

ఇదీ చూడండి: వచ్చే నెల మూడో వారంలో పురపోరు...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details