JNTU: తెలంగాణలో ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల భర్తీ కోసం జేఎన్‌టీయూ కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించింది. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో దాదాపు 220 గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో అధ్యాపకుల నియామకం ఆయా కళాశాలలే చూసుకుంటున్నాయి. బోధన పరంగా అర్హత ఉన్నా.. లేకున్నా.. పట్టించుకోకుండా తమకు నచ్చిన వ్యక్తులను అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయి. తర్వాత జేఎన్‌టీయూ నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో అధ్యాపకులను ర్యాటిఫై(ఆమోదం) చేయించుకుంటున్నాయి. దీంతో కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు అధ్యాపకులుగా నియమితులు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇది రానురాను అక్రమాలకు తావిచ్చింది. వర్సిటీ నుంచి ఆచార్యులు వెళ్లడం.. ప్రైవేటు కళాశాలలనుంచి అందిన కాడికి దండుకుని అధ్యాపకులకు ఆమోదం తెలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.
టెట్ తరహాలో జీవితకాలం ఉండేలా...కరోనా సమయంలో పెద్దఎత్తున అధ్యాపకులను ప్రైవేటు కళాశాలలు తొలగించాయి. జవాబుదారీతనం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అధ్యాపకులను నియమించడం.. తొలగించడం చేస్తున్నాయి. అదే వర్సిటీ తరఫున రిక్రూట్‌మెంట్ జరిగితే ఈ తరహా చర్యలకు అడ్డుకట్ట పడుతుందని జేఎన్‌టీయూ భావిస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా త్వరలోనే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకటన విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎవరైనా అర్హత ఉన్న అభ్యర్థులు పరీక్ష రాయొచ్చు. టెట్ తరహాలో పరీక్షలో స్కోర్ సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.
సరైన స్పష్టత ఇవ్వాలి..