కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లును సినీనటులు జీవిత, రాజశేఖర్ తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద జూనియర్ వైద్యులు చేస్తున్న మహాగర్జనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎగ్జిట్ పరీక్ష పెట్టడం సరికాదన్నారు. బ్రిడ్జి కోర్స్ నిర్వహించి అర్హత లేని వారికి డాక్టర్‌గా అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జనాభాను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.
జూనియర్ వైద్యుల ఆందోళనకు జీవితరాజశేఖర్ మద్దతు - indira park
ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు వద్ద జూనియర్ వైద్యుల చేపట్టిన మహాగర్జనకు సినీనటులు జీవిత రాజశేఖర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
జూనియర్ వైద్యుల ఆందోళనకు జీవితరాజశేఖర్ మద్దతు