ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియమాకానికి సంబంధించి 16,000 టీచర్ పోస్టుల స్థానంలో విద్యా వాలంటీర్లను నియమించారు. వారితోనే విద్యాబోధన జరుపుతున్నారు. అంటే ఈ 16 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ చర్యలు చేపట్టాలి. మన వద్ద ఉన్న ఉపాధ్యాయులతో పూర్తి స్థాయిలో ఆన్లైన్ బోధన చేపట్టే అవకాశం లేదు. కాబట్టి తక్షణమే విద్యావాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాలి. గడిచిన ఐదు మాసాలుగా వారికి జీతాలు ఏవిధంగా చెల్లింపులు చేపట్టారు? - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ.
16 వేల ఉపాధ్యాయ పోస్టులు తక్షణం భర్తీ చేయండి: జీవన్‌రెడ్డి - Telangana assembly samavesalu 2020
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, విద్యావాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ, కోర్టులో ఉన్న ఉమ్మడి సర్వీసుల వివాదానికి పరిష్కారానికి ప్రభుత్వ చర్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఖాళీ ఏర్పడిన స్థానాల్లో విద్యావాలంటీర్లతో భర్తీ చేయండం కుదరదని. శాశ్విత ఉద్యోగులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించుకుంటామని. విద్యావాలంటీర్లను సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియమిస్తుంది మంత్రి సబితా స్పష్టం చేశారు.
194 పాఠశాల్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో 90 వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఖాళీలున్నాయి. వాటితో పాటు 2, 552 మంది పోస్టు గ్రాడ్యూయేట్స్ని మోడల్ స్కూళ్లకు మంజూరు చేయండి జరిగింది. గతేడాది 1,024 మంది విద్యావాలంటీర్లుగా ఉపయోగించుకున్నాం. వారి సేవలను మర్చిపోము. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా ఎక్కడ అవసరముంటే అక్కడ విద్యావాలంటీర్ల సేవలు వినియోగించుకుంటాం. ఖాళీ ఏర్పడిన స్థానాల్లో విద్యావాలంటీర్లతో భర్తీ చేయడం కుదరదు. శాశ్విత ఉద్యోగులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించుకుంటాం. విద్యావాలంటీర్లను సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియమిస్తుంది. ఉమ్మడి సర్వీసులకు సంబంధించి కోర్టులో ఉన్నందున త్వరలోనే పరిష్కారం దొరకుతుందని ఆశిస్తున్నాం. - సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి.
ఇవీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం