'మరణిస్తూ.. మరొకరికి ఆయువుపోసే అవకాశం అందరికీ రాదు' - jeevan daan helps to save lives
మరణం అనేది ప్రకృతి ధర్మం. ప్రాణంతో ఉన్న జీవులన్నీ ఆ విధికి తలవంచాల్సిందే. చనిపోయినప్పుడు శరీర అవయవాలు మట్టిలో కలిసిపోయి... మనిషి భౌతిక రూపం అంతరించిపోతుంది. ఐతే, అవయవదానం చేయడం వల్ల ఇతరులకు ప్రాణం పోస్తూనే... వారి రూపంలో తిరిగి పునర్జన్మ పొందొచ్చంటోంది జీవన్‌దాన్.
జీవన్‌దాన్ ఇంఛార్జితో డాక్టర్ స్వర్ణలత
తాను మరణిస్తూ మరొకరికి ఆయువుపోసే గొప్ప అవకాశం అందరికీ రాదు. అయితే తమ వంతు వచ్చినప్పుడు మాత్రం ముందడుగు వేయాలని ప్రోత్సహిస్తోంది జీవన్‌దాన్. దశాబ్దకాలం క్రితమే బీజం వేసుకున్న జీవన్‌దాన్.... నేడు వేలాదిమంది ప్రాణాలను నిలిపే స్థాయికి చేరుకుంది. ఈనేపథ్యంలో జీవన్‌దాన్ ఇంఛార్జి డాక్టర్ స్వర్ణలతతో.. అవయవదాన ప్రక్రియ, ప్రస్తుతం సమాజంలో ఉన్న అవగాహనపై ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
- ఇదీ చూడండి :అస్తమిస్తూ.. వెలుగునిస్తున్నారు