మల్కాజిగిరిలో కొవిడ్ నిబంధనల నడుమ జేఈఈ పరీక్ష... - జేఈఈ పరీక్షా కేంద్రాలు
మేడ్చల్ మల్కాజిగిరి మౌలాలి అయాన్ డిజిటల్ జోన్లో జేఈఈ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. సెంటర్ వద్దకు విద్యార్థులు ఉదయాన్నే పెద్దసంఖ్యలో చేరుకున్నారు. విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ప్రతీ విద్యార్థిని థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతే లోపలికి అనుమతించారు. కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

jee exams started in malkajgiri