రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 15 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 జరగ్గా... మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. మల్లాపూర్ ఐయాన్ డిజిటల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - jee exam centers in warangal
ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయమే చేరుకున్నారు. సెంటర్లలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పరీక్ష నిర్వహించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా... 1,383 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు వేకువజాము నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలపడంతో గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
ఆదిలాబాద్‌లో తొలిసారిగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ దృష్ట్యా సామాజిక దూరం పాటించేలా అధికారుు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు చేతులు శానిటైజ్ చేసుకున్నాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.