తెలంగాణ

telangana

ETV Bharat / city

జీన్స్​తో చర్మవ్యాధులు.. తెలుసుకోండి నిజాలు! - Tight Pants Are A Health Risk

అందంగా, సౌకర్యంగా ఉండే జీన్స్ ధరించటం అనారోగ్యాలకు కారణమవుతున్నాయా? అవి చర్మ వ్యాధులు తెప్పిస్తాయా? అసలు జీన్స్ మన వాతావరణానికి సరిపడేవేనా? ఈ ప్రశ్నలకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

జీన్స్​తో చర్మవ్యాధులు.. తెలుసుకోండి నిజాలు!

By

Published : Nov 4, 2019, 10:10 AM IST

జీన్స్​తో చర్మవ్యాధులు.. తెలుసుకోండి నిజాలు!

యూరప్ ఖండంలోని బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు చలి నుంచి రక్షించుకునేందుకు జీన్స్ వాడేవారు. ఇప్పుడవి ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం సొంతం చేసుకున్నాయి. మారుతున్న కాలంతో వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. సంప్రదాయ దుస్తులు పండుగలకే పరిమితం అయ్యాయి. ఎటువంటి చోటుకైనా సౌకర్యంగా ఉంటున్న కారణంగా.. ఇప్పుడు యువతీ యువకులు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్​కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బానే ఉంది. కానీ.. ఈ ఆరాటం అతిగా మారితే అనారోగ్యం తప్పదంటున్నారు నిపుణులు.

జీన్స్ వేస్తే చర్మ వ్యాధులు వస్తాయట

జీన్స్ ప్యాంట్లు, టైట్ ఫిట్టింగ్​ల కారణంగా తామర, శోబి వంటి వ్యాధులు యువతలో ఎక్కువగా సోకుతున్నాయని చర్మ వ్యాధుల చికిత్స నిపుణులు తెలిపారు. జీన్స్, సిల్క్, సింథటిక్ బట్టలు వాడే ప్రతి వంద మందిలో పది మంది చర్మ వ్యాధులతో తమ వద్దకు వస్తున్నారని వివరించారు. జీన్స్ దుస్తులు చెమట పీల్చుకోకపోవటం.. గాలి చొరబడనివ్వకపోవటం వంటి కారణాల వల్ల శరీరంపై ఫంగస్ చేరుతుందని వివరించారు.

పైగా... యువత వాడిన జీన్స్​ను ఉతకకుండా వాటినే రోజుల తరబడి వాడుతున్నందున సమస్య మరింత జఠిలమవుతుందన్నారు. వీలైనంత వరకూ జీన్స్​ను తగ్గించి కాటన్ దుస్తులు వాడటం మెుదలుపెడితే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇదీ చదవండి: అందుబాటులోకి రానున్న మరో పైవంతెన

ABOUT THE AUTHOR

...view details