JC Prabhakar reddy: వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే ఏపీ సీఎం జగన్.. వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారని తెదేపా సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావొచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన సీఎం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
'ఏపీ సీఎం జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు... ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినవే' - సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్య
JC Prabhakar reddy: వెంట్రుక కూడా పీకలేరన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా.. ఎవరూ ఏమీ చేయలేరన్నదే సీఎం జగన్ ఉద్దేశం కావచ్చన్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి
ఏపీలోని అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నిన్న పవన్ పర్యటనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. కౌలురైతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను మేలుకొలిపే కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కోరారు. అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.
ఇదీ చదవండి:దళితబంధు లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించాలి: కేటీఆర్