సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారన్న ఆరోపణలతో అరెస్టైన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో వారిని అరెస్టు చేసిన పోలీసులు ఏపీలోని అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి - వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తలు
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
అక్కడ విచారణ తర్వాత భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో నో ప్రాబ్లం అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!
TAGGED:
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్