మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ దేవేంద్రకుమార్‌తో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.
అట్రాసిటీ కేసులో అరెస్టు
వాహనాల రిజిస్ట్రేషన్ అక్రమాల కేసులో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టయ్యారు. 54 రోజుల రిమాండ్ అనంతరం గురువారం కడప జైలు నుంచి విడుదల అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి భారీగా తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కడపకు చేరుకుని, అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని తీసుకొచ్చారు. తాడిపత్రి పరిధిలోని బొందలదిన్నె గ్రామం వద్ద పోలీసులు అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వకపోవటంతో జేసీ అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. ఈక్రమంలో పోలీసులు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జేసీ వాహనం దిగి పోలీసులతో మాట్లాడగా.. అన్ని వాహనాలను అనుమతించారు. అయితే ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని సీఐ దేవేంద్ర... డీఎస్పీ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి ఇంటి వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చినందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
హైడ్రామ నడుమ