తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్​ను కంట్రోల్ చేసేది చంద్రబాబే: జేసీ దివాకర్ రెడ్డి - జేసీ ప్రభాకర్​ రెడ్డి అరెస్టు న్యూస్

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. తెదేపా నేతల అరెస్టులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి పేర్కొన్నారు. బలమైన నాయకులను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్​కు ఎదురు తిరిగితే.. అరెస్టులే ఉంటాయని వ్యాఖ్యానించారు.

jc diwakar reddy
jc diwakar reddy

By

Published : Jun 13, 2020, 2:17 PM IST

జేసీ ప్రభాకర్ రెడ్డికి బైపాస్ ఆపరేషన్ చేశారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని జేసీ దివాకర్​ రెడ్డి అన్నారు. లారీల కొనుగోళ్లలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కాకపోతే ఎన్ఓసీ ఇచ్చిన తరువాత ఎవరైనా వాహనాలు నడుపుకొంటారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఎవరు ఎదురు చెప్పినా.. ప్రశ్నించినా.. ఇలాంటి పరిస్థితే ఉంటుందన్నారు.

రేపు తనను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. సీఎం జగన్ ఎవరికీ భయపడరని.. ఆయన్ని కంట్రోల్ చేయగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమేనని పేర్కొన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని.. ప్రత్యక్ష ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని దివాకర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

జగన్​ను కంట్రోల్ చేసేది చంద్రబాబే: జేసీ దివాకర్ రెడ్డి

ఇదీ చదవండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details