తెలంగాణ

telangana

ETV Bharat / city

జేబీఎస్​ - ఎంజీబీఎస్​ ట్రయల్​ రన్​ విజయవంతం - Hyderabad Metro trains may run faster after November

మహానగరంలో మెట్రో కోసం మరో రూట్ సిద్ధమైంది. జేబీఎస్​ నుంచి ఎంజీబిఎస్​ వరకు ట్రయల్​ రన్​ విజయవంతంగా పూర్తైంది. అధికారులు రెండు రైళ్లతో ఈ ప్రక్రియను నిర్వహించారు.

జేబీఎస్​ - ఎంజీబిఎస్​ మెట్రో ట్రయల్​ రన్​ విజయవంతం

By

Published : Nov 25, 2019, 4:23 PM IST

Updated : Nov 25, 2019, 4:47 PM IST

హైదరాబాద్‌లోని జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. రెండు రైళ్లతో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ ప్రమాణాలకు అనుగుణంగా సాగినట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ నుంచి జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గం అందుబాటులోకి రానుంది.

రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్​ మెట్రో
ఇప్పటికే ప్రజారవాణాలో మెట్రో కీలకంగా మారింది. ఆదరణ పరంగా రికార్డులను అధిగమిస్తూ ముందుకెళ్తోంది. ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మహిళలకు సురక్షిత రవాణాగా మారింది. యువతరం ఇందులో ప్రయాణించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకోవడం ఆదరణకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.

జేబీఎస్​ - ఎంజీబీఎస్​ మెట్రో ట్రయల్​ రన్​ విజయవంతం
ఇదీ చూడండి: అనుభవం లేని వారితో ఆర్టీసీ నడుస్తోంది: హైకోర్టులో వ్యాజ్యం
Last Updated : Nov 25, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details