ఉన్నత విద్యతో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ తెలిపారు. విద్యావ్యవస్థ, టెక్నాలజీలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ... మేథాశక్తిని పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. గ్లోబల్ ట్రీ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జయేష్‌రంజన్‌తోపాటు వర్థమాన సినీ కథానాయిక నిత్య నరేశ్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రీ నిర్వహకులు 30 మంది ఉత్తమ విద్యార్థులకు జీఆర్‌ఈ టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ కోర్సులకు సంబంధించిన ఫీజు అందజేశారు.
ఘనంగా గ్లోబల్ ట్రీ 13వ వార్షికోత్సవం - jayesh ranjan
హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ట్రీ 13వ వార్షికోత్సవంలో తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, సినీ నటి నిత్యనరేశ్ పాల్గొన్నారు.
ఘనంగా గ్లోబల్ ట్రీ 13వ వార్షికోత్సవం