జపాన్‌లో పిల్లలు జూలో జంతువులు చేసే అల్లరి పనులు తనివితీరా చూస్తూ... తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి జపాన్‌లో జూలు తెరిచారా? అనే ప్రశ్న రావొచ్చు!.. ఆ దేశంలోనూ ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షలు ఒక్కోటీ సడలిస్తున్నారు. ఇంకా పూర్తిగా ఎత్తివేయలేదు. అక్కడి కొన్ని జంతు ప్రదర్శనశాలలు, అక్వేరియంల నిర్వాహకులు పిల్లల ఆనందం కోసం లైవ్‌స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి పిల్లలు ఆన్‌లైన్‌లో.. అదీ లైవ్‌లో తమకు ఇష్టమైన జంతువుల వీడియోలు చూస్తూ కేరింతలు కొడుతూ మైమరిచిపోతున్నారు.
జామ్ జామ్‌గా జంతు ప్రదర్శనశాల చూసేద్దామా...! - జంతు ప్రదర్శనశాల వీడియోలు లైవ్ స్ట్రీమింగ్
ఇప్పుడు ఏం నడుస్తోంది..? ఇంకేం నడుస్తుంది? ప్చ్! దాదాపు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌనే నడుస్తోంది. మరి మనలాంటి బుజ్జాయిల పరిస్థితి ఏంటి? ఇంట్లోనే ఉండటం తెగ బోర్ కొడుతోంది కదూ!

జామ్ జామ్‌గా జంతు ప్రదర్శనశాల చూసేద్దామా...!