జనతా కర్ఫ్యూ ప్రభావం రాష్ట్ర రాజధానిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే భాగ్యనగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. హాస్టల్ వాసులతో రాత్రి 12 గంటల వరకు కిటకిటలాడే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు పది గంటలకు ముందే మూతపడ్డాయి.
బోసిపోయిన భాగ్యనగర రహదారులు
జనతా కర్ఫ్యూ ప్రభావం ఒక రోజు ముందుగానే రాష్ట్ర రాజధానిలో కనిపించింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా తెరచి ఉండే వ్యాపార సముదాయాలు, దుకాణాలన్ని రాత్రి 10 గంటలకే మూతపడ్డాయి. ఎప్పుడు రద్దీగా ఉండే అమీర్పేట రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
బోసిపోయిన భాగ్యనగర రహదారులు
పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రాత్రి పది దాటగానే దుకాణాలను బంద్ చేశారు. పాతబస్తీలో రాత్రి రెండు గంటల వరకు కొనసాగే వ్యాపార సముదాయాలు, హోటళ్లు 10 గంటలకే సర్దేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో రోడ్డు పక్కన తెల్లవారు జాము వరకు కొనసాగే టిఫిన్ బండ్లు కూడా ముందుగానే మూసివేశారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా రెండో దశ.. తొలి కాంటాక్ట్ కేసు నమోదు