ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని సీఎం కేసీఆర్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు తనను కోరినట్లు తెలిపారు. నలభై రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆకాంక్షించారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా ట్వీట్ చేశారు.
సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్ - tsrtc strike latest news
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ను జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ట్వీట్ చేశారు.
pawan kalyan
Last Updated : Nov 20, 2019, 8:22 PM IST