తెలంగాణ

telangana

ETV Bharat / city

PAWAN KALYAN PROTEST : ఉక్కు పరిశ్రమ కోసం.. జనసేనాని ఉక్కు పరిరక్షణ దీక్ష - mangalagiri party office

PAWAN KALYAN PROTEST : ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని డిమాండ్​ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్​లో వైకాపా ఎంపీల ప్రవర్తనను ఖండించారు.

janasena-president-pawan-kalyan-protest-in-mangalagiri-party-office
janasena-president-pawan-kalyan-protest-in-mangalagiri-party-office

By

Published : Dec 12, 2021, 2:49 PM IST

PAWAN KALYAN PROTEST : ఏపీలోని మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, మరో 12మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు.

సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంతకు ముందు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రమదానం చేశారు. రహదారులపై పడిన గుంతలను పూడ్చారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details