Pawan Kalyan on Water Tax: ఏపీలో నీటి తీరువా వసూలును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామ్య తీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటిపన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆస్తి పన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని... నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్యబట్టారు.
జగన్ పాలన చేస్తున్నారా? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా?: పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ తాజా వార్తలు
Pawan Kalyan on Water Tax: నీటి పన్నుల వసూళ్లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరును విమర్శించారు. జగన్ పాలన చేస్తున్నారా? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan