కరోనాతో చాలా మంది చనిపోయారని జనసేనాని(janasena) పవన్ కల్యాణ్(PAWAN KALYAN) ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం మంగళగిరి వచ్చారు. ఈ భేటీకి ముందు కరోనాపై జనసేనాని స్పందించారు. తన సన్నిహితులు, బంధువులు చాలామందిని కోల్పోయానని చెప్పారు. కొవిడ్(covid) బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. విపత్తులో చనిపోయిన ప్రతిఒక్కరికి జనసేన తరఫున నివాళులు అర్పిస్తున్నామని వెల్లడించారు. నంద్యాలకు(nandyala) చెందిన ఆకుల సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కు అందజేశారు.
జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడింది. కరోనా విపత్తు సమయంలో జనసైనికులు ధైర్యంగా సహాయం చేశారు. ప్రజలు కూడా మనోబలంతో కరోనా విపత్తును ఎదుర్కొంటున్నారు. జనసైనికులకు పార్టీ అండగా ఉంటోంది. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి ఇచ్చా. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.