అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో ఆయన పర్యటించారు. జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏడుకొండలు ఇంటిపై.. అధికార పార్టీ వర్గీయుల దాడిని మనోహర్ ఖండించారు. ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: నాదెండ్ల - nadendla manohar latest news
గుంటూరు జిల్లా దమ్మాలపాడులో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏడుకొండలు ఇంటిపై.. అధికార పార్టీ వర్గీయులు చేసిన దాడిని ఆయన ఖండించారు. ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: నాదెండ్ల
గ్రామస్థాయిలో ప్రజల మధ్య తగాదాలు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని బెదిరించటం సరికాదన్నారు. నామినేషన్లు వేసిన వారిపై దాడులు చేస్తున్నారని... అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి:ఇంగ్లాండ్తో టీ20లకు సూర్యకుమార్, ఇషాన్- జట్టు ఇదే