ఏపీ మూడు రాజధానుల అంశంపై రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో ఆదివారం జనసేనాని పవన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ, 3 రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన కీలక సమావేశం - మూడు రాజధానులపై జనసేన సమావేశం న్యూస్
ఏపీ మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. రాజధానుల వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ, అమరావతి రైతులకు మద్దతు విషయాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు. భూములిచ్చిన రైతులకు పార్టీ తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చ జరగనుంది.
pavan kalyan
అమరావతి రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చ జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై జనసేన సమావేశం అనంతరం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్