జనసేనకు అండగా ఉంటానని చిరంజీవి చెప్పారని...ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చిరంజీవి ఒప్పించడంతోనే తిరిగి సినిమాలు చేయడానికి పవన్ ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని అంతర్గత భేటీలో చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి పాత్ర : నాదెండ్ల - చిరంజీవిపై నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు
ఏపీలోని విజయవాడలో జనసేన కార్యకర్తల భేటీలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటాననే విషయాన్ని చిరంజీవి తెలిపారని నాదెండ్ల వెల్లడించారు. చిరంజీవి ఒప్పించడంతోనే పవన్ తిరిగి సినిమాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జనసేన రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి పాత్ర : నాదెండ్ల
ఏపీలోని విజయవాడలో మూడు నియోజకవర్గాల క్రియాశీల కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్లను ఆయన పంపిణీ చేశారు. విజయవాడ మహా నగరాన్ని ప్రభుత్వం మార్పులు చేస్తూ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నామని.. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీలో నిబద్ధత కలిగిన వారిని పార్టీ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.కరోనా సమయంలో జనసేన కార్యకర్తలు చేసిన సేవలు చాలా గొప్పవని ప్రశంసించారు.