తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమరావతి ప్రాంతం మరో నందిగ్రామ్​ కాకుండానే మేల్కోవాలి' - మూడు రాజధానులపై పవన్ కామెంట్స్

అమరావతి ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా... తాము మూడు రాజధానులనే నమ్ముతున్నామని అంటే... ఇంత మంది భూములు ఇచ్చేవారు కాదేమోనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మారుస్తామంటే వంచించడమే అవుతుందని పేర్కొన్నారు.

pawan kalyan
'అమరావతి ప్రాంతం మరో నందిగ్రామ్​ కాకుండానే మేల్కోవాలి'

By

Published : Jul 23, 2020, 9:46 PM IST


అన్నదాతలను ఇబ్బంది పెట్టడం సరికాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాజధాని విషయాన్ని సున్నితంగా పరిష్కరించాలని కోరారు. పార్టీ నేతల కోరిక మేరకు వివిధ అంశాలపై జనసేన మీడియా విభాగం నిర్వహించిన ముఖాముఖిలో పవన్ స్పందించారు. దీనికి సంబంధించిన తొలి భాగం వీడియోను పార్టీ విడుదల చేసింది. చాతుర్మాస దీక్ష, వ్రతాలు వ్యక్తిగతంగా చేసే వాడినని.. ఇప్పుడు ప్రజలంతా బాగుండాలనే దీక్ష చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇన్నాళ్లు తెలియలేదని.. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండటంతో ఈ విషయం బయటకొచ్చిందన్నాారు.

కరోనా ప్రపంచ విపత్తు అని పవన్ అన్నారు. దేశంలో విధించిన రెండు నెలలు లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం కచ్చితంగా సద్వినియోగం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్లాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా, బాధ్యతగా ఉండి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే.. కరోనా అలా వచ్చి.. వెళ్లిపోతుందని.. ఫ్లూ లాంటిది అనడం సరికాదన్నారు. జాగ్రత్తగా చెబితే సామాన్య జనానికి కూడా కరోనా తీవ్రత అర్థం అవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇళ్లను ఆలస్యం చేయకుండా..లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అందజేయాలని పవన్ కోరారు. భూముల కొనుగోలు విషయంలోనూ తన దృష్టికి కొన్ని అంశాలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో అవకవతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయని పవన్ అన్నారు.

అమరావతి ప్రాంతం మరో నందిగ్రామ్​ కాకుండానే మేల్కోవాలి

ఇవీచూడండి:కూతురు ఆనందం కోసం.. జడివానలో రయ్​ రయ్​

ABOUT THE AUTHOR

...view details