Pawan Kalyan: ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయల చెక్కులను బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Pawan Kalyan: అనంతపురానికి జనసేనాని.. వారికి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ - పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 12న ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.లక్ష చెక్కులను అందజేయనున్నారు. అనంతరం "రైతు ముఖాముఖి" కార్యక్రమంలో పాల్గొంటారు.
![Pawan Kalyan: అనంతపురానికి జనసేనాని.. వారికి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14981769-896-14981769-1649590832521.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఈనెల 12న సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కల్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కొత్త చెరువు చేరుకుంటారని మధుసూదన్ రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ధర్మవరం పట్టణంలోని శివనగర్, గొట్లూరు, బత్తలపల్లి మండలంలో పర్యటిస్తారని స్పష్టం చేశారు. రైతులను పరామర్శించిన అనంతరం వారితో ముఖాముఖి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:'75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి దుస్థితి ఏనాడు రాలేదు'