జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మంగళవారం సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. 7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
PK tour: విజయవాడకు జనసేన అధినేత పవన్.. ఎప్పుడంటే.! - Pawan Kalyan latest news
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మంగళవారం సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు.
విజయవాడకు పవన్ కల్యాణ్
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలతో రేపు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి..Highcourt: పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Last Updated : Jul 6, 2021, 4:03 PM IST