తెలంగాణ

telangana

ETV Bharat / city

Pawan on Konaseema: ప్రజలంతా సంయమనం పాటించాలి: పవన్​కల్యాణ్​ - తానేటి వనిత వ్యాఖ్యలపై పవన్​ ఆగ్రహం

Pawan on konaseema incident: ఏపీ అమలాపురం ఘటనను జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఖండించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను పవన్​కల్యాణ్​ ఖండించారు.

పవన్​ కల్యాణ్​
పవన్​ కల్యాణ్​

By

Published : May 25, 2022, 12:31 AM IST

Pawan on konaseema incident: ఏపీ అమలాపురం ఘటనను ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దకూడదని పవన్​ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details