ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్ - విజయవాడ మున్సిపల్ పోలింగ్ వార్తలు
ఏపీలోని విజయవాడ పటమటలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వెళ్లగా.. పోలీసులు అదుపు చేశారు.
![ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10944371-1027-10944371-1615354142730.jpg)
ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
ఆయనతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పవన్ వచ్చేసరికి పోలింగ్ కేంద్రం రద్దీగా ఉండటంతో ... ఆయన్ను ప్రత్యేకంగా లోనికి పంపేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో తెలుసా...?
Last Updated : Mar 10, 2021, 11:01 AM IST