తెలంగాణ

telangana

ETV Bharat / city

Janasena Flexi Issue: విజయవాడలో ఫ్లెక్సీల వివాదం.. జనసేన కార్యకర్తల ఆగ్రహం

Janasena Serious on Police: ఏపీలోని విజయవాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం నెలకొంది. పోలీసుల తీరుపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

Janasena Flexi Issue
విజయవాడలో ఫ్లెక్సీల వివాదం

By

Published : Mar 13, 2022, 2:28 PM IST

Janasena Serious on Police: జనసేన ఆవిర్భావ సభ కోసం.. విజయవాడ కనకదుర్గ వారధిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున వారిధిపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. పార్టీ ఫ్లెక్సీని తొలగించడంపై మండిపడ్డారు. ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ పోలీసులను నిలదీశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

విజయవాడలో ఫ్లెక్సీల వివాదం

రేపు ఆవిర్భావ సభ..

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రేపు (సోమవారం) జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్‌ తెలిపారు. రాజకీయంగా జనసేన వైఖరిని ఇదే వేదిక నుంచి పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు.

"వారధిపై జనసేన పార్టీ బ్యానర్లు కడుతుంటే తీసిపడేశారు. అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రం ఉంచుతున్నారు. ప్రశాంతంగా జరిగే సభకు అడ్డొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నాం."-జనసేన పార్టీ కార్యకర్తలు

ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'జన జన జన జనసేనా' అనే గీతాన్ని, గోడ పత్రికనూ ఆయన ఆవిష్కరించారు. సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి 'దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక' అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు పరిశీలించారు.

ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో నియామకాలు..

జనసేన ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు నాదేళ్ల మనోహర్​ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సమన్వయ కమిటీలో 8 మంది, సెక్యూరిటీ కమిటీలో11 మంది, మీడియా కో ఆర్డినేటర్​ కమిటీలో ఆరుగురు, వాలంటీర్ల కమిటీలో ముగ్గురు, మెడికల్​ అసిస్టెన్స్, ప్రచార కమిటీలో ఒక్కొక్కరి చొప్పున నియమించారు.

ఇదీ చదవండి:Best panchayat in nalgonda : గ్రామస్తుల కృషి.. ఉత్తమ గ్రామ పంచాయతీగా 'శ్రీనివాస్​నగర్​'

ABOUT THE AUTHOR

...view details