హైదరాబాద్ నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న పేదలకు జన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. దీనితో పాటుగా నగరంలో వివిధ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేశారు. ప్రస్తుతం వేలాది మంది వలస కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునేందుకు రోజూ వందలాది మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు సంఘ్ జాతీయ అధ్యక్షుడు పర్మానంద్ శర్మ తెలిపారు.
జన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణి
జన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్‌లోని పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు. పలు ప్రాంతాల ప్రజలకు రేషన్ కూడా అందజేశారు. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతోనే తమ వంతు సాయం చేస్తున్నామని సంఘ్ జాతీయ అధ్యక్షుడు తెలిపారు.
జన్ సేవా సంఘ్
ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా పాటిస్తూ.. భౌతిక దూరాన్ని పాటించాలని అందరికి సూచించారు.
ఇదీ చదవండి:కరోనా వేళ వలస బతుకుల వ్యథలు