Gajendra Shekhawat at Polavaram : పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్రమంత్రి షెకావత్.. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వసతులు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Gajendra Shekhawat Polavaram Visit : బాధితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని ఏపీ సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు.