Gajendra Singh Shekhawat on polavaram : పోలవరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. పోలవరం స్పిల్ వే నుంచి 50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వెళ్తున్నందన దాన్ని తట్టుకునేలా మరో ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదన ఉందా అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
Polavaram Project : 'పోలవరం దిగువన మరో ప్రాజెక్టు లేదు' - Polavaram Project latest news
Gajendra Singh Shekhawat on polavaram : పోలవరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రాజెక్టులపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు షెకావత్ సమాధానమిచ్చారు. ఏమన్నారంటే..?
Polavaram Project
ప్రతిపాదన పంపితే సాంకేతిక మదింపు చేశాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. గోదావరిలో ప్రస్తుత ప్రవాహానికి బ్యాక్‌వాటర్, కాఫర్ డ్యామ్‌కు ఉన్న పగుళ్లు కారణమని తెలిపారు. దీనిపై తాము దృష్టి సారించినందునే జులై 31వ తేదీలోగా ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని ప్రభుత్వానికి పదేపదే సూచించామని మంత్రి తెలిపారు. నెల ముందుగానే వరదలు రావడంతో ప్రస్తుతం సమస్యలు తలెత్తాయని మంత్రి వివరించారు.