తెలంగాణ

telangana

ETV Bharat / city

'మిషన్ భగీరథ అధ్యయనానికి బృందాలను పంపండి' - jal jeevan mission 2020

జాతీయ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్ సాహు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. తెలంగాణలో అనుసరిస్తున్న మిషన్ భగీరథ విధానం అందరికీ మార్గదర్శకమన్నారు. ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికత అధ్యయనానికి తెలంగాణకు బృందాలను పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు.

'మిషన్ భగీరథ అధ్యాయనానికి బృందాలను పంపండి'
'మిషన్ భగీరథ అధ్యాయనానికి బృందాలను పంపండి'

By

Published : Jul 17, 2020, 7:39 PM IST

మిషన్​ భగీరథ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకమని జాతీయ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్ సాహు అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆయన లేఖ రాశారు. మంచినీటి సరఫరాలో తెలంగాణ సాంకేతిక విధానం అనుసరిస్తోందని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా నీటి వృధాను అరికట్టి, అవసరమైన మేరకే నీరు సరఫరా చేయవచ్చన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికతను వాడాలని సూచించారు.

దీనిపై అధ్యయనానికి తెలంగాణకు బృందాలు పంపాలని లేఖలో సూచించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details