Congress on AP Special status: 2024లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే తమ ప్రధాని పెడతారని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఈనెల 18న ఏపీలోని కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు.
అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా: జైరాం రమేష్
Congress on AP Special status: రాహుల్ గాంధీ చెపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 18 నుంచి 21 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ జిల్లాలోని సన్నాహక కార్యక్రమాలను పరిశీలించారు. కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెుదటి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని హామీ ఇచ్చారు. కర్నులు జిల్లాలో రాహుల్ పాదయాత్ర నాలుగు రోజులు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ యాత్ర 95 కిలోమీటర్ల మేర సాగుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు.
2024లో కేసీఆర్ వీఆర్ఎస్: ఈ నెల 21 వరకు నాలుగు రోజులపాటు జిల్లాలో 95 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందన్నారు. యాత్ర సన్నాహకాలపై కర్నూలులో కార్యకర్తలు, నాయకులతో.. ఉమెన్ చాందీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శైలజానాథ్, పళ్లంరాజు, హర్షకుమార్‌తో కలిసి వారు సమావేశం నిర్వహించారు. దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయన్న నేతలు.. వాటి నుంచి మళ్లీ ప్రజలను కాపాడుకునేందుకే జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్‌ది బీఆర్ఎస్ పార్టీ కాదని 2024లో వీఆర్ఎస్ తీసుకుంటుందని జోస్యం చెప్పారు.
ఇవీ చదవండి: